Strait of Hormuz Blockade Lifted
Strait of Hormuz Blockade Lifted

అమెరికా-ఇరాన్ మధ్య గత కొద్ది రోజులుగా యుద్ధవాతావరణం వేడెక్కింది. ఇరు దేశాలు బాంబుల వర్షం కురిపించాయి. నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయి. ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఒకానొక సమయంలో మూడో ప్రపంచ యుద్ధం తప్పేలా లేదనిపించింది. ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. మరీ ముఖ్యంగా అంతర్జాతీయంగా ప్రాధాన్యత కలిగిన హర్మూజ్ జలసంధిలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో ఇరాన్ నౌకల రాకపోకలపై అమెరికా దిగ్బంధనాన్ని విధించింది. దీంతో ఇతర దేశాలు ఇంధన భారంతో అల్లాడిపోయాయి. అయితే ఈ ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అడుగు పడింది.

Also Read : సోషల్‌ మీడియాపై ఆ దేశం కీలక నిర్ణయం..15 ఏళ్లు దాటితేనే అకౌంట్‌

ఇరు దేశాలు 60 రోజుల శాంతి ఒప్పందానికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేయడంతో ప్రపంచ దేశాలు ఊపిరిపీల్చుకున్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఒప్పందం ప్రకారం.. గతంలో విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని సైతం అమెరికా ఎత్తివేసింది. ఇదే విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు.. ఇరాన్ ఓడరేవులు, తీర ప్రాంతాలకు వెళ్లే అన్ని రకాల నౌకలపై ఆంక్షలను తొలగిస్తున్నట్లు ప్రటించింది.

ఇకపై ఇరాన్ పరిధిలోని ఓడరేవుల రాకపోకలకు అమెరికా దళాలు అడ్డుకోబోవని, ఎలాంటి ఆటంకాలు కలిగించబోవని స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ శాంతి ఒప్పందంలో భాగంగా దీనిపై మొదటి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన ఎన్నో వాణిజ్య నౌకల ప్రయాణం తిరిగి ప్రశాంతంగా ప్రారంభమైంది. దీంతో మరికొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా మళ్లీ సాధారణ స్థితికి రానుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

మరోవైపు ఈ శాంతి చర్చల నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అమెరికాను తీవ్రంగా హెచ్చరించారు. ఈ శాంతి చర్చల నెపంతో అమెరికా, దాని మిత్రదేశాలు దురుద్దేశంతో వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఒప్పంద నియమాలను ఉల్లంఘించినా.. మితిమీరిన డిమాండ్లు చేసినా తమ రియాక్షన్ వేరే విధంగా ఉంటుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

Also Read : సూపర్‌ ఎల్‌నినో ముప్పు.. సూర్యుడిని మసకబార్చే ‘జియోఇంజినీరింగ్‌’ వినూత్న ప్రతిపాదన!