
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రదేశమైన ఇజ్రాయెల్‌పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల అమెరికా -ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగిన విషయ తెలిసిందే. ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కన పెట్టి మరి ఇజ్రాయెల్ లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లాపై మళ్లీ దాడులకు పాల్పడటంతో డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంచెం బుర్ర ఉపయోగించి నిర్ణయాలు తీసుకోండని ఇజ్రాయెల్ ప్రభుత్వంపై మండిపడ్డారు. హెజ్బొల్లాతో కాల్పుల విరమణకు అంగీకరించాలని తాను స్వయంగా ఇజ్రాయెల్‌ను కోరినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో ఇలా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడటంతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రయత్నాలను దెబ్బతీసేలా ఉన్నాయని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌కు సజిషన్ ఇచ్చినట్లు ట్రంప్ ఇటీవల తెలిపారు.
ఇజ్రాయెల్ చేసిన ఈ దాడుల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్ తప్పకుండా సంయమనం పాటించాలని అందుకే వారిపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. యుద్ధం ఇలాగే కొనసాగితే శాంతి ఒప్పందాలు పూర్తిగా విఫలమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయితే ఈ విషయంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో నేరుగా మాట్లాడారా లేదా అనే విషయాన్ని మాత్రం ట్రంప్ స్పష్టం చేయలేదు. ఇజ్రాయెల్ విషయంలో తాను జోక్యం చేసుకోకపోయి ఉంటే ఈ పాటికి నాశనం అయ్యి ఉండేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.









