sri tulasi private travels bus fire accident
sri tulasi private travels bus fire accident

ఏపీలో రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎన్నో రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అందులోనూ బస్సు ప్రమాదాలు ఎక్కువ. ఇటీవల కాలంలో అగ్నిప్రమాదానికి గురైన ఘోరమైన బస్సు యాక్సిడెంట్లు చాలానే జరిగాయి. తాజాగా అలాంటి ఘటనే మరోకటి చోటుచేసుకుంది.

తాజాగా ఏపీలో మరో ఘోరమైన బస్సు ప్రమాదం జరిగింది. ఓ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అంతా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం హడావుడిగా పరుగులు తీశారు. చివరికి ఎలాగోలా కిందికి దిగి అందరూ తమ ప్రాణాలను సురక్షితంగా కాపాడుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : Beach Shacks : ఏపీలో బీచ్ షాక్స్‌కు గ్రీన్ సిగ్నల్..ఇక మీదట అక్కడ మద్యం విక్రయాలు..కానీ..?

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం వద్ద హైవేపై ఈ ప్రమాదం జరిగింది. శ్రీ తులసి స్లీపర్ ట్రావెల్ బస్సు భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తుండగా.. రేగుపాలెం వద్దకు వచ్చే సరికి ఇంజిన్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అది గమనించిన డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే బస్సును పక్కకు ఆపి ప్రయాణికులందరినీ అలర్ట్ చేశాడు.

Also Read : Telegram : టెలిగ్రామ్‌ నేరగాళ్లకు అడ్డా…: కేంద్రం సంచలన ఆరోపణలు

త్వరగా దిగిపోండి అంటూ సూచించాడు. దీంతో ప్రయాణికులంతా హుటాహుటిన కిందకి దిగి తమ ప్రణాలను కాపాడుకున్నారు. అదే సమయంలో బస్సు ముందు భాగం సగం కాలిపోయింది. ఈ ఘటన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండగా.. వారెవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ఈ ప్రమాదానికి కారణం.. బస్సు ఇంజిన్‌లో డీజిల్ లీక్ కావడమే అని భావిస్తున్నారు.