
ఏపీలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల రిజల్ట్స్ వచ్చేశాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఈ ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు ఈ లింక్ క్లిక్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.
https://results.bse.ap.gov.in/
కాగా రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి, అలాగే మార్కులు పెంచుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలు మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు దాదాపు పది రోజుల పాటు వివిధ పరీక్షా కేంద్రాల్లో జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 వేల మంది విద్యార్థులు ఈ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఎగ్జామ్స్ పూర్తయిన కొద్ది రోజుల్లోనే విద్యాశాఖ మూల్యాంకనం చేపట్టి పూర్తి చేసింది. విద్యార్థుల పైచదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫలితాలను త్వరగానే విడుదల చేసింది.









