BIG BREAKING :  ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఉత్తర జిల్లాలో రిక్టర్ స్కేలుపై 2.9 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీమాలజీ వెల్లడించింది.

నేషనల్ సెంటర్ ఫర్ సీమాలజీ అందించిన వివరాల ప్రకారం, ఆదివారం తెల్లవారుజామున 4:14:01 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. దీని భూగర్భ కేంద్రాన్ని భూమికి 8 కిలోమీటర్ల లోతులో, ఉత్తర అక్షాంశం 28.721 డిగ్రీలు, తూర్పు రేఖాంశం 76.957 డిగ్రీల వద్ద గుర్తించినట్లు ఎన్సీఎస్ ఎక్స్ వేదికగా తెలిపింది. భూకంప ప్రకంపనలు జరిగిన వెంటనే ప్రజలు బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం కూడా జరగలేదు.

సాధారణంగా భూకంపాలు భూమి ఉపరితలం నుంచి సుమారు 700 కిలోమీటర్ల లోతు వరకు ఎక్కడైనా సంభవించవచ్చు. శాస్త్రీయ ప్రయోజనాల నిమిత్తం యూఎస్‌జీఎస్ డేటా ప్రకారం ఈ 0 నుండి 700 కి.మీ. లోతు పరిధిని మూడు జోన్లుగా విభజించారు.

వీటిలో తక్కువ లోతులో సంభవించే భూకంపాలు సాధారణంగా ఎక్కువ ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇలాంటి భూకంపాల వల్ల వెలువడే ప్రకంపన తరంగాలు భూమి ఉపరితలానికి చాలా తక్కువ దూరంలో ప్రయాణించాల్సి ఉంటుంది. దీనివల్ల ఉపరితలంపై బలమైన భూకంప ప్రకంపనలు ఏర్పడి, కట్టడాలకు ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.