
Eshwar Sai : సోషల్ మీడియా వేదికగా విపరీతమైన వివాదానికి దారితీసిన యూట్యూబ్ ఫోక్ డ్యాన్సర్స్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌ల వ్యవహారంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. తన తప్పు ఒప్పుకుంటూ ఈశ్వర్‌సాయి ఓ వీడియోలో జరిగిన తప్పును ఒప్పుకుంటూ దానికి దారితీసిన పరిస్థితులను వివరించారు.
తెలుగు జానపద కళారంగంలో ‘బాసింగ బలాలు’ వంటి వరుస హిట్ పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫోక్ డ్యాన్సర్, నటుడు ఈశ్వర్ సాయి ఇటీవల తీవ్ర వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఒక భవనంలో తోటి ఫోక్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్‌తో కలిసి ఒకే గదిలో ఉన్న సమయంలో, ఈశ్వర్ సాయి భార్య శరణ్య వారిని ప్రత్యక్షంగా పట్టుకున్న విషయం వైరల్ గా మారింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈశ్వర సాయి జరిగిన విషయం పై నోరు విప్పారు. తన వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొన్నానని ఈశ్వర్ వెల్లడించారు. “నాకు ఇంట్లో కొంచెం డిస్టర్బెన్సెస్ అయినాయి. కొంచెం ప్రెజర్ ఉంది. అటు రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఫ్యామిలీ ప్రెజర్స్ కావచ్చు, అటు బిజినెస్ ప్రెజర్ కావచ్చు. చాలా ప్రెజర్ ఉంటది,” అని ఆయన తన ఆవేదనను వ్యక్త పరిచాడు. అలాంటి పరిస్థితులలో ఒక మగాడికి మనశ్శాంతి అత్యవసరమని, తాను కూడా అదే కోరుకున్నానని ఈశ్వర్ సాయి చెప్పుకొచ్చాడు.
తను ఉన్న అటువంటి క్లిష్టమైన సమయంలో తనకు కనెక్ట్ అయిన వ్యక్తి మాధురి అని ఆయన వివరించారు. మాధురి చాలా మంచి పర్సన్ అని, చాలా గుడ్‌హార్టెడ్ వ్యక్తి అని, ఆమెను తప్పు పట్టాల్సిన అవసరం లేదని ఈశ్వర్ సాయి తేల్చి చెప్పాడు. తనకున్న ఒత్తిళ్లకు, మాధురి చూపిన కేరింగ్‌కు తాను బాగా ఆకర్షితుడయ్యానన్నారు. అది తన వ్యక్తిగత భావన అని ఆయన వివరించారు. మాధురి తనకు అందించిన ఆత్మీయత, శ్రద్ధ తనకు ఎంతగానో నచ్చాయని ఈశ్వర్ సాయి వెల్లడించారు. జరిగిన విషయంలో ఆమెకు చేతులెత్తి క్షమాపణ చెబుతున్నానని అన్నారు.
మాధురి రాథోడ్‌తో తనకు సుమారు నాలుగు, ఐదు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడిందని, అయితే, ఆ ఐదేళ్ల కాలంలో తమ బంధం ఒక స్నేహానికి లేదా సహోద్యోగుల మధ్య ఉండే వృత్తిపరమైన సంబంధానికి మించి ఎప్పుడూ లేదని ఆయన స్పష్టం చేశారు. “నేను గానీ, మాధురి గానీ మేము డైరెక్ట్‌గా మేము క్లోజ్‌గా మాట్లాడుకొని నువ్వు అని మాట్లాడుకున్న రోజు కూడా లేదని వివరించారు. మీరు, ఈశ్వర్ గారు, మాధురి గారు ఇవే నడుస్తాయి మా ఇద్దరి మధ్య,” అని ఈశ్వర్ సాయి వారి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారు.
ఇదిలా ఉండగా ఘటన జరిగిన రోజు తన భార్యకు లేని ఆవేశం వీడియో తీసిన మహిళకు ఎందుకు వచ్చిందనేది నాకు అర్థం కావడం లేదు అని అనుమానం వ్యక్తం చేశాడు. కాగా, ఈ ఘటనతో ఫోక్ ఇండస్ట్రీపై విమర్శలు వస్తున్నాయి. దీంతో చాలామంది ఫోక్ డ్యాన్సర్స్.. వ్యక్తిగత గొడవలను ఇండస్ట్రీలోకి తీసుకురావద్దని, పని వేరు.. పర్సనల్ వేరు అని చెప్పుకొచ్చారు. ఇక ఈశ్వర్ సాయి సైతం ఈ వివాదంపై స్పందిస్తూ తాను చేసిన తప్పును బహిరంగంగా అంగీకరించాడు. ఆవేశంలో, ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాలు తనను తప్పుదోవ పట్టించాయని ఒప్పుకుంటూ తన వీడియోలో చెప్పాడు.
ఈశ్వర్ సాయి మాట్లాడుతూ.. ‘ ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ క్షణంలో నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అనిపించింది. కానీ తరువాత ప్రశాంతంగా ఆలోచిస్తే నేను చేసింది ముమ్మాటికీ తప్పేనని అర్థమైంది.. నాకు, మాధురికి రెండు, మూడు నెలల నుంచే రిలేషన్ మొదలయ్యింది. నాకున్న ఒత్తిడిలో.. ఆమె సపోర్ట్ గా నిలిచింది. ఆ స్ట్రెస్.. ఆ మూమెంట్ లో నాకు అది కావాలనిపించింది. అయితే తప్పును ఒప్పుకోవడంలోనే నిజాయితీ ఉంది. భార్య ఉండగా.. ఇలాంటి పనిచేయడం తప్పే. దానిని నేను సరిదిద్దుకుంటాను. దీనికి, ఫోక్ ఇండస్ట్రీకి సంబంధం లేదు. దాని వలనే నేను బతుకుతున్నాను. అదే నాకు అన్నం పెడుతుంది. దయచేసి ఫోక్ ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడొద్దని చెప్పుకొచ్చాడు.









