Philippines earthquake (1)
Philippines earthquake (1)

వెనిజులాలో ఇటీవల భారీ భూకంపం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. బహుళ అంతస్తుల భవనాలు పేకమేడళ్ల నేలకూలాయి. ఈ విషాదం మరువక ముందే మరోసారి భూకంపం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది.

Philippines Earthquake

తాజాగా దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలు‌పై 6.5గా నమోదైంది. రాత్రి 7.30 గంటల సమయంలో భూమి కంపించగా.. ఇళ్లల్లో ఉన్న ప్రజలు బయటకు పరుగులు తీశారు. ముందు జాగ్రత్తగా అధికారులు ప్రజలను అలెర్ట్ చేశారు. ఎత్తైన ప్రదేశాలకు వెళ్లి తలదాచుకోవాలని సూచించారు.

మొదట దీని తీవ్రతను 6.7గా అధికారులు అంచనా వేశారు. కానీ ఆ తర్వాత దీనిని 6.5గా సవరించారు. ఇది మిండనావో ద్వీపంలోని జోస్ అబాద్ సాంటోస్ పట్టణానికి సుమారు 35 కి.మీ దూరంలో ఉన్నట్లు యూఎస్‌జీఎస్ వెల్లడించింది. ఈ భూకంపం తర్వాత ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఇప్పటి వరకు ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.