
Nepal Floods : ఇటీవల నేపాల్ లో ఆకస్మిక వరదలు సంభవించి వేలాది మంది మరణించడంతో పాటు ఆ దేశం తీవ్ర స్థాయిలో నష్టపోయింది. అయితే ఈ వరదలు రావడానికి మీరే కారణం. మీ మూడు దేశాలు కర్బన ఉద్గారాలను ఎక్కువ మొత్తంలో విడుదల చేస్తున్నాయి. మీ మూలంగానే వాతావరణ మార్పులు తలెత్తి ఆ ప్రభావం మా దేశం మీద పడుతోంది. కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ మా దేశంలో జరిగిన నష్టానికి నష్టపరిహారం చెల్లించాల్సిందే నంటూ భారత్, చైనా, అమెరికా దేశాలను నేపాల్ డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. కర్బన ఉద్గారాలు అధికంగా వెదజల్లే దేశాల్లో యూఎస్, చైనా, భారత్‌లు ముందువరుసలో ఉన్నాయని నేపాల్ ఆరోపించింది. కాబట్టి, ఆ మూడు దేశాలు తమకు ఆర్థిక పరిహారం కూడా చెల్లించాలని నేపాల్ డిమాండ్ చేస్తోంది. మాకు మీరు దయ, జాలితో అందించే సాయం అసలే వద్దు.. నైతిక బాధ్యతగా నష్టపరిహారం చెల్లించాలంటూ నేపాల్ కొత్త వాదనను తెర మీదకు తీసుకు రావడం చర్చనీయంశంగా మారింది.
కాగా నేపాల్ లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలతో వెయ్యి మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.. అంతకంటే భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లిన సంగతి కూడా తెలిసిందే. ఇంకా వేలాది మంది గల్లంతయిన వారి ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. కాగా, ఆ దేశ సహాయక, పునరావాస చర్యలు, పునర్నిర్మాణం కోసం నేపాల్‌కు భారీ మొత్తంలో నిధులు అవసరం అవుతాయి. దీంతో ప్రపంచ దేశాలు నేపాల్‌కు తమ వంతు సాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. అయితే తమకు కావాల్సింది దయతో చేసే సాయం కాదని.. నైతిక బాధ్యతగా నష్టపరిహారం చెల్లించాలంటూ నేపాల్ సంచలన డిమాండ్ చేయడం గమనార్హః. ప్రపంచంలోనే అత్యధిక కర్బన ఉద్గారాలను వెలువరిస్తోన్న అమెరికా, చైనా, భారత్ దేశాలు.. తమకు వాతావరణ నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆ దేశం డిమాండ్ చేస్తోంది.
Also Read : ఇరాన్లో లక్ష మందికి పైగా ఉద్యమకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..
ఈ మేరకు నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ కనాల్ మాట్లాడుతూ. పర్యావరణ మార్పుల్లో నేపాల్ పాత్ర తక్కువే అని. అయినా తాము మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్తులో నష్టపోయిన తాము న్యాయం కోసం, పరిహారం కోసం దౌత్యమార్గాల్లో ప్రయత్నాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ విషయంపై చర్చించేందుకు నేపాల్ ప్రధాని బాలెన్ షా స్వయంగా ఐక్యరాజ్య సమితికి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడటం గమనార్హం. విపత్తు నేపథ్యంలో ఇప్పటికే నేపాల్ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించిన విషయం తెలిసిందే. తక్షణ అవసరాల కోసం ఉద్దేశించిన నిధి నుంచి సాయం మంజూరు చేయాలని ఆ దేశం అభ్యర్థించింది. ఈ నష్టం నుంచి బయటపడేందుకు తమకు 4 నుంచి 5 బిలియన్ డాలర్ల నిధులు అవసరమని నేపాల్ ఆర్థిక మంత్రి ఐరాసకు విన్నవించుకున్నారు.
ఈ సందర్భంగా నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ కనాల్ మాట్లాడుతూ.. తమ దేశం చాలా స్వల్ప మొత్తంలో కర్బన ఉద్గారాలను విడుదల చేస్తోందన్నారు.. అయితే ప్రపంచ వాతావరణ మార్పులు, సంక్షోభ తీవ్ర పరిణామాలను తమ దేశం అనుభవిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ హౌస్ వాయువులను ఎక్కువ మొత్తంలో విడుదల చేసే దేశాలకు.. వాతావరణ మార్పుల వల్ల నష్టపోయే తమ లాంటి దేశాల పట్ల బాధ్యత ఉంటుందని శిశిర్ వ్యాఖ్యానించారు. తమ దౌత్య విధానాన్ని సాయం కోరడం నుంచి న్యాయబద్ధమైన పరిహారం డిమాండ్ చేసే వైపు మారుస్తున్నామని నేపాల్ మంత్రి ప్రకటించటం విశేషం. మాకు ఎవరి భిక్ష అవసరం లేదు.. నైతిక బాధ్యతతో నష్ట పరిహారం చెల్లించండి అని ఆ దేశం స్పష్టం చేస్తోంది. కాగా, నేపాల్ ఇప్పటికే వాతావరణ పరిహారం క్లెయిమ్‌ను అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలకు పంపించింది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని తాము బలంగా లేవనెత్తుతామని నేపాల్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు.
Also Read : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు









